రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
- ఐపీఎల్ లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్
- రోహిత్ శర్మ ఫామ్ ఆందోళనకరంగా ఉందన్న సెహ్వాగ్
- అభిమానులు ప్రశ్నించక ముందే రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవాలని సూచన
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశాలపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై చిత్తుగా ఓడిపోయిన తర్వాత, ఒక క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన సెహ్వాగ్, హిట్ మ్యాన్ భవిష్యత్తుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన రోహిత్, ఇప్పటికే రెండు మ్యాచ్‌లకు దూరం కావడం ముంబై జట్టు సమతూకాన్ని దెబ్బతీసిందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఫామ్ ఆందోళనకరంగా ఉందని, అభిమానులు ప్రశ్నించే పరిస్థితి రాకముందే అతడు తన రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. సరైన సమయంలో గౌరవప్రదంగా తప్పుకోవడం ఉత్తమమని తనదైన శైలిలో చెప్పాడు.
ఇలాగే వరుస ఓటములు కొనసాగితే, ముంబై ఇండియన్స్ ప్లే-ఆఫ్స్ రేసు నుండి నిష్క్రమిస్తుందని హెచ్చరించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కూడా ఒత్తిడి పెరుగుతోందని, రోహిత్ గైర్హాజరీలో బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోందని విశ్లేషించాడు.