గర్జనకు సిద్ధమైన ‘గాయపడ్డ సింహం’.. ట్రైలర్ ఎప్పుడంటే..!
- తరుణ్ భాస్కర్ హీరోగా ‘గాయపడ్డ సింహం’ చిత్రం
- రేపు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్న మేకర్స్
- మే 1న థియేటర్లలో సినిమా గ్రాండ్ రిలీజ్
- హీరోయిన్గా నటిస్తున్న ఫరియా అబ్దుల్లా
- అమెరికన్ డ్రీమ్ నేపథ్యంలో సెటైరికల్ ఎంటర్టైనర్గా రూపకల్పన
దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, ఇప్పుడు హీరోగా ‘గాయపడ్డ సింహం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ ఎంటర్టైనర్కు సంబంధించి చిత్రబృందం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. సినిమా ట్రైలర్‌ను రేపు (ఏప్రిల్ 25న) విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మే 1న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. అమెరికన్ డ్రీమ్ అనే ఆసక్తికరమైన కథాంశంతో సెటైరికల్ కామెడీ, ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన మూవీ ‘ట్రైజర్’లో తన సొంత సినిమా ‘పెళ్లి చూపులు’పై తరుణ్ భాస్కర్ వేసిన పంచులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాకు స్వీకర్ అగస్తీ సంగీతం సమకూర్చగా, దర్శకుడు పవన్ సాదినేని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని, మే 1న థియేటర్లలో ఈ ‘గాయపడ్డ సింహం’ ఎలాంటి గర్జన వినిపిస్తుందో చూడాలని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.