కుప్పకూలిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో బేర్‌మన్న మార్కెట్
- బలహీన అంతర్జాతీయ సంకేతాలతో మార్కెట్లకు భారీ నష్టం
- 670 పాయింట్లకు పైగా పతనమై 77,845 వద్దకు సెన్సెక్స్
- ఫార్మా, ఆయిల్, గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు డల్
బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అమ్మకాల ఒత్తిడితో గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజుల ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు కుప్పకూలాయి.
ఉదయం 9:25 గంటల సమయానికి సెన్సెక్స్ 671 పాయింట్లు (0.85%) నష్టపోయి 77,845 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 179 పాయింట్లు (0.74%) క్షీణించి 24,198 వద్ద కొనసాగుతోంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా స్వల్ప నష్టాల్లోనే ఉన్నాయి. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఆటో, కన్జుమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.
ఏప్రిల్ 22న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2,078 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIలు) సైతం రూ. 1,078 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఈ అమ్మకాల ఒత్తిడి మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ఆసియా మార్కెట్లలో చైనా, జపాన్, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే, అమెరికా మార్కెట్లు బుధవారం రాత్రి లాభాలతో ముగిశాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అక్కడ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. సాంకేతికంగా, నిఫ్టీకి 24,100–24,000 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని, 24,400–24,500 శ్రేణిలో నిరోధం ఎదురుకావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.