తమిళనాడులో ఊహించని ఫలితాలు వస్తాయి: నటుడు విజయ్

  • కూటముల లెక్కలు, పార్టీల అంచనాలు తారుమారవుతాయన్న విజయ్
  • విజిల్ సత్తా ఏమిటో ఫలితాలు చెబుతాయన్న విజయ్
  • డీఎంకేను ఇంటికి పంపించేందుకు ఇదే చివరి ప్రచారమన్న విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయని, కూటముల లెక్కలు, పార్టీల అంచనాలు ఈ ఎన్నికల్లో తారుమారవుతాయని ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విజిల్ సత్తా ఏమిటో ఫలితాలు చెబుతాయని అన్నారు. ఎన్నికల్లో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని అన్నారు. తరం మారిందని, సంప్రదాయ ఓటింగ్ లెక్కలు ఇప్పుడు చిత్తు కానున్నాయని జోస్యం చెప్పారు.

డీఎంకేను ఇంటికి పంపించేందుకు ఇదే చివరి ప్రచారమని, స్టాలిన్ సర్ ఇంటికే పరిమితమవుతారని జోస్యం చెప్పారు. బీజేపీకి చెందిన ఒక మంత్రి తనను నటుడు అంటున్నారని, నేను నటుడిని అన్న మాట వాస్తవమేనని, కానీ రాజకీయాల్లో మాత్రం నటుడిని కాదని అన్నారు. కానీ వీరు రాజకీయాల్లో నటులు అని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని చెప్పి బీజేపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఒక్కడిని ఓడించడం కోసం అందరూ ఏకమయ్యారని వ్యాఖ్యానించారు.

TVK chief takes on BJP and DMK
tamil Nadu Elections

More Telugu News