తమిళనాట విజయ్ పార్టీపై చంద్రబాబు ఏమన్నారంటే..!

  • తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించిన విజయ్
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
  • విజయ్ ఎలా రాణిస్తాడో ఇంకా చెప్పలేమన్న చంద్రబాబు 
  • ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గత రెండ్రోజులుగా తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన చెన్నైలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబును, విజయ్ కొత్తగా స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, "రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి పార్టీ పెట్టిన విజయ్ ఏ మేరకు రాణించగలడో ఇంకా చెప్పలేం" అని అన్నారు.

అది కొత్త పార్టీ అని, దానిపై తానేమీ వ్యాఖ్యానించలేనని తెలిపారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దామని చంద్రబాబు బదులిచ్చారు. 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి 'తమిళగ వెట్రి కళగం' పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. దాంతో ఆయన విజయావకాశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Chandrababu Naidu
Vijay Thalapathy
Tamilaga Vettri Kazhagam
TVK Party
Tamil Nadu Elections
Andhra Pradesh CM
Piyush Goyal
Chennai
Tamil Nadu Politics
Kollywood Star

More Telugu News