గ్లోబల్ టాప్ 10 చికెన్ వంటకాల జాబితాలో కొరియన్ చికెన్ ఫస్ట్.. మన 'బటర్ చికెన్' ర్యాంక్ ఎంతంటే..?

International
Advertisement
  • ప్రపంచంలోని బెస్ట్ 100 చికెన్ వంటకాల జాబితాను విడుదల చేసిన టేస్ట్ అట్లాస్
  • మొదటి స్థానంలో నిలిచిన దక్షిణ కొరియా వంటకం 'చికెన్' (కొరియన్ ఫ్రైడ్ చికెన్)
  • ఆరో స్థానం దక్కించుకున్న భారతీయ వంటకం 'బటర్ చికెన్'
  • రెండు సార్లు ఫ్రై చేయడం వల్లే కొరియన్ చికెన్‌కు అద్భుతమైన రుచి
Advertisement
ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' 2026 ఏప్రిల్ కు సంబంధించి ప్రపంచంలోని టాప్ 100 బెస్ట్ చికెన్ వంటకాల జాబితాను తాజాగా విడుదల చేసింది. చికెన్ వంటకాలను ఇష్టపడే వారికి ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ జాబితాలో దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ వంటకం 'చికిన్' (కొరియన్ ఫ్రైడ్ చికెన్) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక, భారత్‌లో విశేష ప్రజాదరణ పొందిన ఢిల్లీ స్పెషల్ 'బటర్ చికెన్' ఈ గ్లోబల్ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. క్రీమీగా ఉంటూ, కాస్త పుల్లటి రుచితో ఉండే ఈ గ్రేవీ వంటకం అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే, 2025 నవంబర్ జాబితాలో 5వ స్థానంలో ఉన్న బటర్ చికెన్.. ఈసారి ఒక స్థానం కిందకు పడిపోయింది.

మొదటి స్థానంలో నిలిచిన కొరియన్ ఫ్రైడ్ చికెన్ ప్రత్యేకత ఏంటంటే.. దీనిని రెండు సార్లు ఫ్రై చేస్తారు (డబుల్ ఫ్రైయింగ్ మెథడ్). ముందుగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చికెన్‌ను నూనెలో వేయించి, ముక్క లోపల బాగా ఉడికేలా చేస్తారు. ఆ తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మళ్లీ వేయించడం ద్వారా చికెన్ పైన ఎంతో క్రిస్పీగా, క్రంచీగా మారుతుంది. దీనికి స్పైసీ గోచుజాంగ్, సోయా గార్లిక్, హనీ బటర్ వంటి సాస్‌లను జోడించి అందిస్తారు. కొన్నిచోట్ల ఈ ఫ్రైడ్ చికెన్‌ను సాస్‌లో కలిపి లేదా పైన సాస్ వేసి ఇస్తారు. ఈ వంటకంతో పాటు పికిల్డ్ ముల్లంగి, కోల్‌స్లా లేదా పుచ్చకాయ ముక్కలను సైడ్ డిష్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా దీన్ని బీర్‌తో కలిపి తీసుకోవడానికి అక్కడి ప్రజలు ఇష్టపడతారు. ఆ కాంబినేషన్‌ను 'చిమెక్' అని పిలుస్తారు.

టేస్ట్ అట్లాస్ ప్రకటించిన టాప్ 10 చికెన్ వంటకాలు ఇవే:
1. చికిన్ (కొరియన్ ఫ్రైడ్ చికెన్) - సౌత్ కొరియా
2. పోలో ఎ లా బ్రసా (పెరూవియన్ రోస్ట్ చికెన్) - పెరూ
3. ఇనాసల్ నా మనోక్ - ఫిలిప్పీన్స్
4. పిలిక్ తోప్కపి - టర్కీ
5. ముర్గ్ కరాహీ (చికెన్ కరాహీ) - పాకిస్థాన్
6. ముర్గ్ మఖానీ (బటర్ చికెన్) - ఢిల్లీ, ఇండియా
7. రఫిస్సా - మొరాకో
8. కరాగే - జపాన్
9. పౌలెట్ రోటీ (ఫ్రెంచ్ రోస్ట్ చికెన్) - ఫ్రాన్స్
10. సిట్సిలా టబాకా (చికెన్ టబాకా) - జార్జియా
Advertisement

సంబంధిత వార్తలు

Butter ChickenSouth KoreaFried ChickenTop 10 Chicken Dishes

More Telugu News

భారత పేసర్ల ధాటికి కివీస్ విలవిల.. తొలి వన్డేలో 185 పరుగులకే ఆలౌట్

04 Nov, 11:29

పోలవరం-బనకచర్ల లింక్‌పై రేవంత్ సర్కార్ ద్వంద్వ వైఖరి: కవిత

04 Nov, 11:21

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు ఐఫోన్ 16.. ఢిల్లీ కంపెనీపై ప్రశంసల వర్షం!

04 Nov, 11:20

గాయకుడిగా సల్మాన్.. 'తేరి సెక్సీ బ్యూటీ' సాంగ్ రిలీజ్

04 Nov, 11:19

ఏపీలో రేపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... పోలింగ్ జరుగుతుందా?

04 Nov, 11:13

ఇరాన్‌పై అణుదాడి జరిగితే భారత్‌కూ ముప్పు తప్పదా? రేడియేషన్‌ ఎక్కడి వరకు వస్తుంది?

04 Nov, 11:12

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఏపీ, తెలంగాణలో ఈడీ మెరుపుదాడులు

04 Nov, 11:09

రైలు వెళ్లిన కాసేపటికే పట్టాలపై పేలుడు.. అదీ భారత్‌-పాక్‌ సరిహద్దుకు కొంత దూరంలో..!

04 Nov, 11:08

ధన త్రయోదశి షాక్.. గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధరలు!

04 Nov, 10:57

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి పొన్నం

04 Nov, 10:54

‘‘నేను నేరుగా బరిలో ఉంటేనా’’.. మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ తొలి స్పందన!

04 Nov, 10:52

నా ఫేవరెట్ కెప్టెన్లు ఆ ఇద్ద‌రే.. నా కెప్టెన్సీ మాత్రం కష్టకాలంలో గడిచింది: సచిన్

04 Nov, 10:50

అమెరికా మధ్యంతర ఎన్నికలు: ఫ్లోరిడాలో భారత సంతతి మహిళ పియా దండియా ఘన విజయం

04 Nov, 10:42

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి కొత్త సారథి

04 Nov, 10:39

'రామాయణం' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనం.. రూ.100 కోట్లకు చేరువలో!

04 Nov, 10:38
..More Telugu News