అంతర్జాతీయ స్థాయిలో ‘రాకా’ మ్యూజిక్: సంగీత దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

  • అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ‘రాకా’
  • సంగీతంపై ఆసక్తికర విషయాలు చెప్పిన సాయి అభ్యంకార్ 
  • అంతర్జాతీయ స్థాయిలో మ్యూజిక్ అందిస్తామన్న మ్యూజిక్ డైరెక్టర్
  • దర్శకుడు అట్లీకి సంగీతంపై స్పష్టమైన విజన్ ఉందని వెల్లడి
  • సినిమాపై మరింతగా పెరిగిన అంచనాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘రాకా’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్, థీమ్ ట్రాక్‌తో ఆస‌క్తిని రెకేత్తించిన‌ ఈ సినిమా గురించి తాజాగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘రాకా’ సంగీతాన్ని కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ ప్రాజెక్ట్ గురించి సాయి అభ్యంకార్ మాట్లాడుతూ.. దర్శకుడు అట్లీకి సంగీతంపై ఉన్న స్పష్టత అద్భుతమని అన్నారు. "సినిమాకు ఎలాంటి సౌండ్ అవసరమో, ట్రాక్స్ ఎలా ఉండాలో అట్లీకి పూర్తి అవగాహన ఉంది. ఆయన ఆలోచనలకు తగ్గట్టు నేను స్వరపరిచిన థీమ్ ట్రాక్ అల్లు అర్జున్ కి, అట్లీకి ఎంతో నచ్చింది" అని ఆయన వివరించారు. ఈ సినిమా మ్యూజిక్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.

"ఇంటర్నేషనల్ లెవెల్ సౌండ్ ఇవ్వాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. ప్రతి పాటలోనూ ఒక కొత్త అనుభూతిని పంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అని సాయి అభ్యంకార్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, అట్లీ మాస్ టేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమాకు ప్రపంచస్థాయి సంగీతం కూడా తోడవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయింది.

మొత్తం మీద ‘రాకా’ కేవలం ఒక కమర్షియల్ చిత్రంగానే కాకుండా, సాంకేతికంగా, సంగీతపరంగా ఉన్నత ప్రమాణాలతో రాబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తదుపరి అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sai Abhyankkar
Raaka Movie
Allu Arjun
Atlee

More Telugu News