చెన్నై సిటీలో హోరెత్తిన చంద్రబాబు రోడ్ షో

  • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  •  చెన్నైలోని అన్నానగర్ లో చంద్రబాబు రోడ్ షో
  • ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు, అభిమానులు
  •  ఎన్డీయే కూటమి అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలకు పిలుపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోయంబత్తూరు, హోసూరులో ప్రచారం ముగించుకున్న అనంతరం నిన్న రాత్రి చెన్నైలోని అన్నానగర్ రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహించగా, స్థానిక టీడీపీ, ఎన్డీయే శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు చెన్నైకి విచ్చేశారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు రోడ్ షోలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనడంతో సందడిగా మారింది.

టీడీపీ, ఎన్డీయే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లుతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. 


Chandrababu Naidu
Chandrababu
TDP
Tamil Nadu Elections
Chennai Roadshow
Anna Nagar
Andhra Pradesh
NDA Alliance
Tamil Nadu Politics
Telugu Desam Party

More Telugu News