వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

YS Vijayamma Birthday Greetings from Nara Lokesh
  • నేడు వైఎస్ఆర్ అర్ధాంగి విజయమ్మ పుట్టినరోజు 
  • సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
  • విజయమ్మకు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆకాంక్ష
నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్ధాంగి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా విజయమ్మకు లోకేశ్ బర్త్‌డే విషెస్ చెప్పారు. "వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ ఆకాంక్షించారు.
Go Back to Shorts
Nara Lokesh
YS Vijayamma
YS Rajasekhara Reddy
TDP
YSRCP
Andhra Pradesh Politics
Birthday Wishes
Political Greetings

More Telugu News