పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ
- పవన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు 'ఎక్స్'లో వెల్లడి
- పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. శనివారం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్‌కు ప్రధాని ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. "ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారితో మాట్లాడి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన చాలా ధైర్యవంతుడు, త్వరలోనే కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను" అని తన పోస్టులో పేర్కొన్నారు.
కాగా, శుక్రవారం నాడు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా అధికారులతో చర్చిస్తుండగా పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎమ్ఆర్ఐ స్కాన్‌తో పాటు పలు పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమని సూచించారు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, 7 నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.