'క్యూట్' మెసేజ్ రచ్చ.. నటి తాన్యాపై క్రికెటర్ చాహల్ పరువు నష్టం దావా!

Yuzvendra Chahal Files Defamation Suit Against Taniya Chatterjee Over Cute Message Row
  • నటి తాన్యా చటర్జీకి క్రికెటర్ చాహల్ లీగల్ నోటీసులు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్యూట్' అని మెసేజ్ చేశారని తాన్యా వ్యాఖ్య
  • వీడియో వైరల్ కావడంతో వివాదం ముదిరి లీగల్ టర్న్
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, నటి తాన్యా చటర్జీ మధ్య సోషల్ మీడియాలో మొదలైన వివాదం తీవ్రరూపం దాల్చింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్ మెసేజ్ చేశారంటూ తాన్యా చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా, ఈ వ్యవహారం ఇప్పుడు చట్టపరమైన చర్యలకు దారితీసింది. తన పరువుకు నష్టం కలిగించారంటూ చాహల్.. తాన్యా చటర్జీపై పరువునష్టం దావా వేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం తాన్యా చటర్జీ మీడియాతో మాట్లాడుతూ.. యజ్వేంద్ర చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి 'క్యూట్' అని మెసేజ్ చేశారని చెప్పింది. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో పెద్ద దుమారం రేగింది. ఈ సంఘటన క్రీడా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ వివాదంపై స్పందించిన తాన్యా చటర్జీ, ఈ విషయం ఇంత పెద్దది అవుతుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ విషయం ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. అందరూ నన్నే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. నేనే బద్నాం అవుతున్నాను. ఆయనకు ఏమీ కావడం లేదు. నాపైనే పరువునష్టం కేసు వేశారు" అని ఆమె వాపోయారు. తనకు ఈ-మెయిల్ ద్వారా లీగల్ నోటీసు అందినట్లు కూడా తాన్యా ధ్రువీకరించారు.

కోల్‌కతాకు చెందిన తాన్యా చటర్జీ.. 'గందీ బాత్' సీజన్ 4, 'జాల్', 'కసక్' వంటి పలు ఓటీటీ ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు, యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వివాదంపై చాహల్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒక చిన్న సోషల్ మీడియా కామెంట్‌తో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు లీగల్ నోటీసుల వరకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.
Go Back to Shorts
Yuzvendra Chahal
Tanya Chatterjee
Chahal defamation case
Instagram message
Indian cricketer
Gandii Baat
Social media controversy
IPL 2024
Punjab Kings
Defamation lawsuit

More Telugu News