కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష

Telangana
Advertisement
  • రాజేంద్రనగర్ ఆర్డీవో కొప్పుల వెంకటరెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, 2వేల జరిమానా విధించిన న్యాయస్థానం
  • భూవివాదంలో కోర్టు ఉత్తర్వులు పాటించకపోవడమే కారణం
  • అప్పీలు కోసం తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేత
Advertisement
కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఆర్డీవో కొప్పుల వెంకట్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నెల రోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. అప్పీలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు వారాలు అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్ద షాపూర్‌లోని 74.97 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. ఈ భూమికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఆర్డీవో వెంకట్‌రెడ్డి నిర్దిష్ట గడువులోగా అమలు చేయలేదు. దీనిపై భూమి యజమాని నవాబ్ మహ్మద్ యూసుఫుద్దీన్‌ ఖాన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ధిక్కరించారని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో వెంకట్‌రెడ్డికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 
 
Advertisement

సంబంధిత వార్తలు

Koppula Venkat ReddyRDO RajendranagarTelangana High CourtCourt Contempt CaseRangareddy DistrictShamshabadNawab Mohammed Yusufuddin KhanCV Bhaskar Reddy

More Telugu News

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53

కూటమి పాలనకు ప్రజల పట్టం.. ఇది అమూల్యమైన తీర్పు: పవన్ కల్యాణ్

03 Nov, 23:09

హైదరాబాద్‌లో భారీ ఫేక్ కరెన్సీ రాకెట్.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత

03 Nov, 22:55

'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. శ్రీలీల క్యారెక్టర్ ఇదే!

03 Nov, 22:49

రాహుల్ గాంధీ నిద్రపోతున్న పోస్టర్లు.. కోల్‌కతా సాల్ట్ లేక్ లో కలకలం!

03 Nov, 22:41

విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమి కైవసం.. వరుదు కల్యాణిపై భారీ ఆధిక్యంతో ముక్కా శ్రావణి విజయం

03 Nov, 21:47

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

03 Nov, 21:28

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ బయల్దేరిన ప్రసిద్ధ్ కృష్ణ

03 Nov, 21:13

ఇది సంబరాలకు కాదు, సేవకు సమయం: పురపాలిక తీర్పుపై నారా లోకేశ్

03 Nov, 20:49

కడప జిల్లాలో 4 మున్సిపాలిటీలు టీడీపీ కైవసం.. బీజేపీ ఖాతాలో ఒకటి!

03 Nov, 20:41

మురసు తుపాను ఎఫెక్ట్.. చిలకలూరిపేట హైవేపై వరద నీరు, విజయవాడలో ఎడతెరిపిలేని వాన

03 Nov, 20:27

రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి

03 Nov, 20:16

జగన్ పాలనను జనం మర్చిపోలేదు.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమికే: పల్లా శ్రీనివాసరావు

03 Nov, 20:10

కంగ్రాట్స్ చంద్రబాబు టీమ్!: జగన్

03 Nov, 19:31

అన్ని అపోహలు పటాపంచలు.. సౌర తుపానుల గుట్టు విప్పిన ఆదిత్య-ఎల్1

03 Nov, 19:14
..More Telugu News