విపక్షాలు జీవితాంతం చింతిస్తాయి: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ

Narendra Modi Slams Opposition Over Women Reservation Bill Failure
  • బిల్లుకు మద్దతివ్వకుండా విపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయన్న మోదీ
  • విపక్షాలు భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమని వ్యాఖ్య
  • బిల్లుకు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా సాకులు వెతుకుతున్నారన్న మోదీ
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పందించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన విపక్షాలు జీవితాంతం చింతిస్తాయని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వకుండా విపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో శనివారం కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు విపక్షాలు భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమని అన్నారు.

బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నదే కాకుండా దానిని కప్పిపుచ్చుకోవడానికి వారు సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకమనే విషయాన్ని ప్రతి గ్రామానికి చేరవేయాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Narendra Modi
Women Reservation Bill
Parliament
Lok Sabha
Opposition Parties
Central Government

More Telugu News