అంబటి రాంబాబు నిరాహారదీక్ష.. ఎవరినీ వదిలిపెట్టను అంటూ వార్నింగ్

Andhra
Advertisement
  • ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు దీక్ష
  • తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని నిరసన
  • ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్
Advertisement

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా, నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో అంబటి నేడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై, పోలీసు వ్యవస్థపై నిప్పులు చెరిగారు. "చంద్రబాబును దూషించాననే సాకుతో నన్ను అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో ఉంచారు.. మరి నా ఇంటిపై దాడి చేసి కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన వారిని కనీసం 18 నిమిషాలైనా లోపల వేశారా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ దాడి అంతా పోలీసుల కళ్లముందే జరిగిందని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


ఈ దాడి వెనుక నారా లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ల హస్తం ఉందని అంబటి ఆరోపించారు. గుంటూరులో ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారని విమర్శించారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో 'కస్టోడియల్ టార్చర్'కు గురిచేసే ప్రయత్నం జరిగిందని, ఆ గాయాలు ఇంకా మానలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "నన్ను భయపెట్టాలనుకోవడం మీ పొరపాటే.. ప్రాణాలకు తెగించైనా న్యాయపోరాటం చేస్తాను. ఎవరినీ వదిలిపెట్టను" అని హెచ్చరించారు. ఈ దీక్షకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైసీపీ నేతలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు తదితరులు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు.

Advertisement

సంబంధిత వార్తలు

Ambati RambabuYSRCPHunger Strike

More Telugu News

నా వికెట్ సెలబ్రేషన్ ఆమె కోసమే.. సీక్రెట్ చెప్పిన అర్ష్‌దీప్ సింగ్

04 Nov, 13:16

విదేశాలకు వెళ్తున్నారా?.. మీ వాట్సాప్‌పై ప్రభావం చూపే కొత్త నిబంధన!

04 Nov, 13:03

ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

04 Nov, 13:00

నంబర్‌ 3లో కోహ్లీ కింగ్‌.. వన్డేల్లో 13 వేల పరుగులతో ప్రపంచ రికార్డు!

04 Nov, 12:58

నా ఆఫర్‌ను నజ్రియా మూడుసార్లు తిరస్కరించింది: సూర్య

04 Nov, 12:45

వికెట్‌ కోసం అత్యాశకు పోయాం.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తప్పును అంగీకరించిన అర్ష్‌దీప్‌!

04 Nov, 12:43

రిపబ్లికన్ కంచుకోటలో పాగా వేసిన డెమొక్రాట్.. కాన్సస్‌లో 94 ఏళ్ల తర్వాత చారిత్రక విజయం

04 Nov, 12:42

శ్రీవారి సర్వదర్శనం జెట్ స్పీడ్‌.. క్యూలైన్లలోకి నేరుగా ప్రవేశం

04 Nov, 12:36

వాంగ్‌చుక్ సంస్థకు లడఖ్ సర్కార్ షాక్.. స్కూల్ కార్యకలాపాలు నిలిపివేయాలని నోటీసు

04 Nov, 12:35

ఈడీ విచారణకు హాజరైన అంబటి రాంబాబు

04 Nov, 12:22

అమెరికాలో ట్రంప్‌కు గట్టి షాక్.. కాంగ్రెస్‌పై డెమొక్రాట్ల పట్టు.. భారత్‌పై ప్రభావమెంత?

04 Nov, 12:21

రేపే ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

04 Nov, 12:04

హిందూ-యూదుల బంధంతో ముస్లింలకు ముప్పట.. భారత్‌-ఇజ్రాయెల్‌ దోస్తీపై పాక్‌ అక్కసు!

04 Nov, 12:03

హ్యాపీనెస్ ఆల్వేస్.. టబుకు జాకీ ష్రాఫ్ స్పెషల్ బర్త్ డే విషెస్!

04 Nov, 12:00

వివేక్ రామస్వామికి వివాదాస్పద యాడ్ దెబ్బ.. ప్రత్యర్థిపై వ్యక్తిగత దాడి బెడిసికొట్టింది!

04 Nov, 11:57
..More Telugu News