కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత

Telangana
Advertisement
  • పదేళ్లుగా కేటీఆర్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదన్న కవిత
  • ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా
  • అందరికీ అధికారం కావాలని తాను అన్న తర్వాతే కష్టాలు మొదలయ్యాయని వెల్లడి
Advertisement

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్ పై విమర్శల దాడిని ఉద్ధృతం చేశారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో పలు సామాజిక సంఘాల నేతలతో భేటీ అయిన ఆమె, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై రాజీకయంగా అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


"పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎందుకు ప్రజల్లోకి పోలేదు? ఇప్పుడు పాదయాత్రలు చేస్తానంటే ఎవరు నమ్ముతారు?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్ పాదయాత్ర ప్రస్తావనను ఎద్దేవా చేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని వారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం వెనుక అర్థమేంటని నిలదీశారు.


సామాజిక తెలంగాణే లక్ష్యంగా తాను కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టానని, అందుకే తనకు అనేక కష్టాలు వచ్చాయని కవిత పేర్కొన్నారు. "అందరికీ అధికారం అందాలని నేను మాట్లాడటం మొదలుపెట్టాకే నాకు సమస్యలు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేసినా, సామాజిక తెలంగాణ సాధించే వరకు నా పోరాటం ఆగదు" అని ఆమె స్పష్టం చేశారు. 


తన కొత్త పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ వంటి బహుజన సంఘాలు మద్దతు తెలపడం తనకు కొండంత బలాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. వీరన్న అనుచరులు తనతో కలవడమంటే ఇక తమను ఆపే శక్తే లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.


బీఆర్ఎస్‌కు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడతానని బాంబు పేల్చారు. గ్రహగతులు అనుకూలించాలని, ఏదైనా శని అడ్డు ఉంటే తొలగిపోవాలని వారణాసిలో పూజలు చేసినట్లు కూడా ఆమె వెల్లడించారు.

Advertisement

సంబంధిత వార్తలు

KavithaKTRBRSTelangana PoliticsKalvakuntla KavithaMaroju VeerannaSocial TelanganaTelangana JagruthiPadayatraFormer MLAs

More Telugu News

వయసు పెరిగినా తగ్గని జోరు.. "ఇంకా 21 ఏళ్ల అమ్మాయినే అనుకుంటా" అంటున్న సింధు

04 Nov, 14:02

యూఎస్ ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమి.. వ్యంగ్యంగా స్పందించిన ఎలాన్ మస్క్

04 Nov, 13:48

రూ.2 కోట్ల లంచం ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విజిలెన్స్‌ విచారణకు కేరళం ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

04 Nov, 13:41

'ఇమ్మోర్టల్ ' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

04 Nov, 13:38

అమెరికా సెనేట్‌కు తొలి ముస్లిం.. చరిత్ర సృష్టించిన అబ్దుల్

04 Nov, 13:33

ఏడాది ముందే ఎల్‌నినో ముప్పు పసిగట్టొచ్చు.. శాస్త్రవేత్తల కొత్త పరిశోధన!

04 Nov, 13:30

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి: కూటమి పార్టీల నేతలకు చంద్రబాబు పిలుపు

04 Nov, 13:29

నా వికెట్ సెలబ్రేషన్ ఆమె కోసమే.. సీక్రెట్ చెప్పిన అర్ష్‌దీప్ సింగ్

04 Nov, 13:16

విదేశాలకు వెళ్తున్నారా?.. మీ వాట్సాప్‌పై ప్రభావం చూపే కొత్త నిబంధన!

04 Nov, 13:03

ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

04 Nov, 13:00

నంబర్‌ 3లో కోహ్లీ కింగ్‌.. వన్డేల్లో 13 వేల పరుగులతో ప్రపంచ రికార్డు!

04 Nov, 12:58

నా ఆఫర్‌ను నజ్రియా మూడుసార్లు తిరస్కరించింది: సూర్య

04 Nov, 12:45

వికెట్‌ కోసం అత్యాశకు పోయాం.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తప్పును అంగీకరించిన అర్ష్‌దీప్‌!

04 Nov, 12:43

రిపబ్లికన్ కంచుకోటలో పాగా వేసిన డెమొక్రాట్.. కాన్సస్‌లో 94 ఏళ్ల తర్వాత చారిత్రక విజయం

04 Nov, 12:42

శ్రీవారి సర్వదర్శనం జెట్ స్పీడ్‌.. క్యూలైన్లలోకి నేరుగా ప్రవేశం

04 Nov, 12:36
..More Telugu News