అమెరికాలో గంజాయితో పట్టుబడిన ఎయిరిండియా కో-పైలట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో గంజాయితో పట్టుబడిన ఎయిరిండియా కో-పైలట్

Air India Co Pilot Arrested with Cannabis in US
  • మరో విమానంలో వెనక్కి పంపిన అమెరికా అధికారులు
  • ఎయిరిండియాకు సమాచారం అందించిన అమెరికా అధికారులు
  • ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదన్న ఎయిరిండియా
శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకున్న ఓ ఎయిరిండియా విమానంలోని కో-పైలట్ వద్ద అమెరికా అధికారులు గంజాయిని గుర్తించి, అక్కడి నుంచి వెనక్కి తిప్పి పంపించారు. కో-పైలట్ 'స్టాఫ్ ఆన్ డ్యూటీ' కింద ప్యాసింజర్ క్యాబిన్‌లో ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అతడు విమానాన్ని నడపాల్సి ఉంది.

ఈ క్రమంలో శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు చేసిన తనిఖీల్లో అతడి వద్ద గంజాయి దొరికింది. దీనితో అమెరికా అధికారులు ఎయిరిండియాకు సమాచారం అందించారు. అతడిని మరో విమానంలో భారత్‌కు తిప్పి పంపించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై ఎయిరిండియా ఫిర్యాదు చేయడంతో డీజీసీఏ దర్యాప్తు జరుపుతోంది.

ఈ అంశంపై ఎయిరిండియా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించింది. చట్ట ఉల్లంఘనలను తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలిపింది. ఇదివరకు కూడా ఒక ఎయిరిండియా పైలట్ ఒకరు వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో విఫలమయ్యాడు. వాంకోవర్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానానికి చెందిన ఆ పైలట్‌ను కెనడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Air India
Air India co-pilot
San Francisco
cannabis
DGCA
Vancouver International Airport
India

More Telugu News