రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన‌ ఎక్సైజ్ సీఐ

Excise CI Deenu Satyanarayana Caught Red Handed Taking Bribe
  • కామారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ
  • రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
  • కల్లు దుకాణం తరలింపునకు లంచం డిమాండ్ చేసిన సీఐ సత్యనారాయణ
  • సీఐని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అధికారులు
కామారెడ్డి జిల్లాలో ఓ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బిచ్కుంద ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న దీను సత్యనారాయణ రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే... ఓ వ్యక్తి తన కల్లు దుకాణాన్ని మరో గ్రామానికి మార్చుకోవడానికి అనుమతి కోరాడు. అదే సమయంలో తనపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని కూడా విజ్ఞప్తి చేశాడు. ఈ పని చేసిపెట్టడానికి సీఐ సత్యనారాయణ బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. బిచ్కుందలోని సీఐ అద్దె ఇంట్లో బాధితుడి నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ వద్ద అదనంగా లభించిన రూ.45,670 నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సత్యనారాయణపై కేసు నమోదు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.
Go Back to Shorts
Kamareddy
Deenu Satyanarayana
Excise CI
ACB
Bichkunda
Bribery Case
Corruption
Telangana
Liquor Shop
Nampally Court

More Telugu News