బిందీ ధరించడానికి అనుమతిలేదని ప్రచారం... స్పందించిన లెన్స్‌కార్ట్ సీఈవో

Peyush Bansal Responds to Lenskart Bindi Ban Controversy
  • బిందీ, తిలకం పెట్టుకోవడానికి లెన్స్ కార్ట్‌లో అనుమతి లేదని ప్రచారం
  • లెన్స్ కార్ట్ సిబ్బందికి గైడ్ లైన్స్ పేరిట నెట్టింట ప్రచారం
  • సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందన్న సీఈవో
ఆఫీస్ డ్రెస్ కోడ్‌లో భాగంగా సిబ్బంది మతపరమైన గుర్తులు ధరించవద్దని లెన్స్‌కార్ట్ సర్క్యులర్ జారీ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో, సీఈవో పీయూష్ బన్సల్ స్పందించారు. లెన్స్‌కార్ట్ సిబ్బందికి గైడ్ లైన్స్ పేరిట నెట్టింట కొన్ని పాయింట్లు వైరల్ అయ్యాయి.

వీటి ప్రకారం, స్టోర్లలో సిబ్బంది నలుపు రంగు హెడ్ స్కార్ఫ్ (హిజాబ్), నలుపు తలపాగాలు ధరించడానికి అనుమతి ఉంది. తిలకం, బిందీ పెట్టుకోవడానికి మాత్రం అనుమతి లేదు. వీటిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. మతపరమైన పక్షపాతం చూపిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై పీయూష్ బన్సల్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. లెన్స్‌కార్ట్ విషయంలో అసత్య ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిందీ, తిలకం సహా ఎలాంటి మతపరమైన వ్యక్తీకరణలపైనా తమ సంస్థలో ఆంక్షలు లేవని తెలిపారు. తాము ఎప్పటికప్పుడు తమ సంస్థ మార్గదర్శకాలను సమీక్షిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అది పాత సర్క్యులర్ అని, ఆ విధానాలు ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించవని స్పష్టం చేశారు. అది కాలం చెల్లిన ట్రైనింగ్ నోట్ అని, అది తమ హెచ్ఆర్ పాలసీని ప్రతిబింబించబోదని తెలిపారు. ఈ గందరగోళం పట్ల క్షమాపణలు కోరుతున్నట్లు పీయూష్ బన్సల్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Peyush Bansal
Lenskart
Lenskart CEO
Bindi
Tilak
Religious symbols
Dress code
Social media

More Telugu News