కేరళలోని దేవాలయానికి భారీ రోబోటిక్ ఏనుగు బహూకరణ

PETA India gifts robotic elephant to Kerala temple
  • పెటా ఇండియా-అనితా డోంగ్రే ఫౌండేషన్ సంయుక్తంగా రోబోటిక్ ఏనుగు బహూకరణ
  • త్రిసూర్‌లోని శ్రీ భద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి 'పున్నక్కపరంబిల్ మహాదేవన్' ఏనుగు బహూకరణ
  • భక్తుల సమక్షంలో రోబోటిక్ ఏనుగు ఆవిష్కరణ
కేరళలోని ఓ దేవాలయానికి పెటా ఇండియా-అనితా డోంగ్రే ఫౌండేషన్ సంయుక్తంగా భారీ రోబోటిక్ ఏనుగును బహూకరించాయి. త్రిసూర్‌లోని శ్రీ భద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి 'పున్నక్కపరంబిల్ మహాదేవన్' అనే రోబోటిక్ ఏనుగును అందజేసినట్లు పెటా వెల్లడించింది. మలయాళ నూతన సంవత్సరం విషు నామ సంవత్సర వేడుకల సందర్భంగా భక్తుల సమక్షంలో ఈ ఏనుగును ఆవిష్కరించారు.

ఆలయంలో నిర్వహించే వేడుకల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా, సురక్షితంగా నిర్వహించుకోవడానికి వీలుగా దీనిని ఉపయోగించనున్నారు. కేరళ వ్యాప్తంగా వివిధ ఆలయాలకు పెటా అందించిన రోబోటిక్ ఏనుగుల్లో ఇది 14వది కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 25 రోబోటిక్ ఏనుగులను బహుమతిగా ఇచ్చినట్లు పెటా తెలిపింది.
Go Back to Shorts
PETA India
Kerala temple
Robotic elephant
Anita Dongre Foundation
Sree Bhadrakali Vishnu Maya Temple

More Telugu News