అంబేద్కర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారు: కవిత
- అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కవిత
- అంబేద్కర్ అంటేనే ధైర్యం అన్న కవిత
- తెలంగాణ ఏర్పడింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అన్న కవిత
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఫోరమ్ ఆధ్వర్యంలో కవిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ అంటేనే ధైర్యం అని అన్నారు.
పేదల తలరాతను మార్చగలిగే శక్తి భారత రాజ్యాంగానికి ఉందని పేర్కొన్నారు. అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్న అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ ప్రత్యేక తెలంగాణగా ఏర్పడిందంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తిని ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమానికి నైతిక పునాది లేకపోయేదని అన్నారు.
అంబేద్కర్ ఇచ్చిన ధైర్యంతో మనం ఈ ప్రభుత్వంపై కూడా పోరాడి పేదవారికి న్యాయం చేయాలనుకుంటున్నామని అన్నారు. ఈ భూమి మీద అంబేద్కర్ వ్యతిరకులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి రావాలని కవిత అన్నారు.