ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, భారత్ సహా వివిధ దేశాల్లో పేదరికంలోకి 88 లక్షలమంది
- పశ్చిమాసియా యుద్ధం ప్రభావం భారత్‌పై ఉంటుందని ఐక్యరాజ్యసమితి నివేదిక
- భారత్‌లో 25 లక్షల మంది పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
- ఈ యుద్ధం ప్రభావం చైనాపై కూడా ఉంటుందని వెల్లడి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంపై పడుతోంది. ఈ యుద్ధం కారణంగా దేశంలోని 25 లక్షల మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. పలు దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఈ సంక్షోభం భారత్ పైనా తీవ్ర ప్రభావం చూపనుందని ఐక్యరాజ్యసమితి తాజాగా తెలిపింది.
'పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలు.. ఆసియా, పసిఫిక్‌లో మానవ అభివృద్ధిపై ప్రభావాలు' పేరుతో ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం యుద్ధ ప్రభావం ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని తగ్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రభావం చైనాలో కూడా ఉంటుందని అంచనా వేసింది.
యుద్ధం కారణంగా ఇంధన ధరలు, రవాణా, ముడిసరుకుల ఖర్చులు కుటుంబాల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తాయని పేర్కొంది. ఆహార సంబంధ సమస్యలు పెరుగుతాయని, ప్రభుత్వ బడ్జెట్లపై భారం పడుతుందని వెల్లడించింది. ప్రజల జీవనోపాధిపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ యుద్ధం ప్రభావం భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్‌తో సహా అనేక దేశాల్లో ఆహార భద్రత ఒత్తిళ్లు తీవ్రమవుతాయని హెచ్చరించింది.
యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే భారతదేశంలో యూరియా నిల్వలు తగ్గిపోతాయని తెలిపింది. హర్మూజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్‌లో వైద్య పరికరాలకు సంబంధించిన ముడి పదార్థాల ధరలు యాభై శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. మెడిసిన్స్ ధరలు ఇప్పటికే పది నుంచి పదిహేను శాతం పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది.