తండ్రికి ఘన నివాళులు...మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగ ట్వీట్
తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దివంగత డి. శ్రీపాదరావు వర్ధంతి (ఏప్రిల్ 13) సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకుని, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి నేర్పిన విలువలనే మార్గదర్శకాలుగా ప్రజాసేవలో ముందుకు సాగుతానని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు తన సందేశాన్ని పంచుకున్నారు. "నాన్నా... మీరు నేర్పిన సంస్కారం, అందించిన విలువలు, చూపిన బాట... ప్రజా సేవలో నన్ను నిత్యం ముందుకు నడిపించే వెలుగు దివ్వెలు. మీ అడుగుజాడలే నా ధైర్యం.. మీ ఆశీస్సులే నా బలం. మీ వారసత్వాన్ని గుండెల్లో మోస్తూ... మీ ఆశయాలే మార్గదర్శకంగా... మీ బిడ్డగా నా ఆఖరి శ్వాస వరకు 'మంథని' ప్రజల కోసమే పని చేస్తా. మీ స్ఫూర్తితో మొదలైన నా ఈ సేవా యజ్ఞం ఆగదు.. ప్రజల పట్ల నాకున్న ఈ సంకల్పం సడలదు. మీ అడుగుజాడల్లో నా ఈ ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది" అని పేర్కొన్నారు.
కాగా, శ్రీపాదరావు 1999 ఏప్రిల్ 13న కరీంనగర్ జిల్లాలో నక్సలైట్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మరణానంతరం శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి ప్రవేశించి, మంథని నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.