ఆశాజీ శాశ్వత సంగీత సర్వస్వాన్ని మనకు అందించి స్వర్గానికి వెళ్లారు: అమితాబ్ బచ్చన్

Asha Bhosle left us says Amitabh Bachchan
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణం పట్ల బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతిపై తన బ్లాగ్‌లో భావోద్వేగంగా స్పందించారు. "ఒక శకం ముగిసింది. ఒక అద్భుతమైన, అసాధారణమైన ఉనికిని కోల్పోయాం. ఆశా భోంస్లే జీ మనల్ని విడిచి వెళ్లారు. నేను తీవ్రమైన దుఃఖంలో ఉన్నాను" అని ఆవేదన చెందారు.

ఆమె గాత్రంలోని వైవిధ్యాన్ని ప్రశంసిస్తూ, "ఆమె పాడిన ప్రతి పాటకు తన స్వరంతో ప్రాణం పోశారు. మనకు శాశ్వత సంగీత సర్వస్వాన్ని అందించి స్వర్గానికి వెళ్లారు. శరీరం మనల్ని విడిచిపెట్టినా, ఆమె ఆత్మ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఆమె స్వరం అమరం" అని అమితాబ్ నివాళులర్పించారు. నేడు ఆశా భోంస్లే నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి అమితాబ్ బచ్చన్ నివాళులర్పించారు.

లెజెండరీ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో బహుళ అవయవాల వైఫల్యంతో తుదిశ్వాస విడిచారు. సోమవారం ఆమె భౌతికకాయాన్ని ముంబైలోని నివాసంలో అంతిమ దర్శనం కోసం ఉంచారు. అనంతరం, ప్రభుత్వ లాంఛనాలతో త్రివర్ణ పతాకంలో చుట్టి అంతిమయాత్ర నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.

1943లో మరాఠీ చిత్రం 'మాఝా బాల్'తో కెరీర్ ప్రారంభించిన ఆశా భోంస్లే, ఎనిమిది దశాబ్దాల పాటు తన గానంతో సంగీత ప్రియులను అలరించారు. 'చురా లియా హై తుమ్నే', 'దో లఫ్జోం కీ హై దిల్ కీ కహానీ' వంటి ఎన్నో అద్భుతమైన పాటలతో ఆమె చిరస్థాయిగా నిలిచిపోతారు.
Go Back to Shorts
Asha Bhosle
Asha Bhosle death
Amitabh Bachchan
Bollywood singer
Legendary singer
Passes away
Music industry
Indian singer
Marathi cinema
Chura Liya Hai Tumne

More Telugu News