ప‌వ‌న్, నిహారిక‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. చివరకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అనుదీప్

Comedian Anudeep Katikala Apologizes After Remarks on Pawan Kalyan Niharika Spark Controversy
వినోదం పేరుతో హద్దులు దాటితే తీవ్ర పరిణామాలు తప్పవని మరోసారి రుజువైంది. స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల తన కామెడీ షోలో ప్రముఖ రాజకీయ, సినీ రంగ వ్యక్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆయన చివరకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కామెడీ క్లబ్‌లో అనుదీప్ చేసిన ప్రదర్శనకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రదర్శనలో భాగంగా ఆయన మెగా డాటర్ నిహారిక కొణిదెల వ్యక్తిగత జీవితంపై, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌లను ఉద్దేశించి కూడా అనుచితంగా మాట్లాడటంతో టీడీపీ, నందమూరి అభిమానులు సైతం మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అనుదీప్ ప్రదర్శన ఇచ్చే 'ది స్ట్రీట్ కామెడీ క్లబ్' వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఆ సమయంలో క్లబ్‌లోపలికి వెళ్లి అనుదీప్ కోసం వెతకగా, ఆయన అక్కడ లేకపోవడంతో నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసి వెళ్లిపోయారు. అభిమానుల ఆగ్రహం, నిరసనలతో భయపడిన అనుదీప్, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో పలు కామెడీ క్లబ్‌లు తాత్కాలిక మూసివేత
ఈ ఘటన ప్రభావంతో హైదరాబాద్‌లోని సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లోని పలు స్టాండప్ కామెడీ క్లబ్‌లు ముందుజాగ్రత్త చర్యగా తమ షోలను తాత్కాలికంగా రద్దు చేసుకున్నాయి. పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన అనుదీప్, చివరికి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. అయితే, ఆయన క్షమాపణపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. "భయంతో క్షమాపణలు చెప్పడం కాదు, ముందే ఆలోచించి మాట్లాడాలి" అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ప్రతిభతో కాకుండా వివాదాలతో గుర్తింపు తెచ్చుకోవాలనే ధోరణి సరైంది కాదని పలువురు హితవు పలుకుతున్నారు.
Go Back to Shorts
Anudeep Katikala
Anudeep
Pawan Kalyan
Niharika Konidela
Balakrishna
Nara Lokesh
Telugu comedy
standup comedy controversy
Hyderabad comedy clubs
mega family

More Telugu News