యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు పెట్టండి.. పోలీసులకు ఏఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు

ప్రముఖ టీవీ యాంకర్ విష్ణుప్రియ భీమినేనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) నాయకులు పోలీసులను ఆశ్రయించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో డబ్బుల కోసం అర్ధనగ్న వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ విజయవాడ సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ మాట్లాడుతూ.. విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న వీడియోలు చూడాలంటే నగదు చెల్లించి సబ్‌ స్ర్కైబ్ చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

ఎంతోమందికి తెలిసిన ఒక సెలబ్రిటీ కేవలం డబ్బు కోసం ఇలాంటి అసభ్యకరమైన వీడియోలను ప్రోత్సహించడం సరికాదన్నారు. ఇది సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం పంపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తక్షణమే బ్లాక్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తమ ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దీపక్, సిద్దు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Vishnu Priya
Vishnu Priya Anchor
AISF Complaint
Cyber Crime Vijayawada
Instagram Videos
Obscene Videos
Criminal Case
Youth
Controversial Videos

More Telugu News