హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకుల దుర్మరణం
- హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం
- అతివేగంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్
- మృతులు పాతబస్తీకి చెందిన సోహెద్, సాహిల్‌గా గుర్తింపు
- హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై ఘటన
మృతులను పాతబస్తీకి చెందిన అబ్దుల్ సోహెద్ (20), షేక్ సాహిల్ (17)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.