హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకుల దుర్మరణం

హైదరాబాద్‌ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్‌) సమీపంలోని హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులను పాతబస్తీకి చెందిన అబ్దుల్ సోహెద్ (20), షేక్ సాహిల్ (17)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుప‌త్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Hyderabad Road Accident
Rajendranagar
Outer Ring Road
Road accident
Sheikh Sahil
Himayat Sagar
Electricians
Fatal accident
Telangana news

More Telugu News