'డెకాయిట్' తొలి రోజు కలెక్షన్ల రికార్డ్... అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలిరోజు రూ.15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ వసూళ్లతో 'డెకాయిట్' అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం మొదటి రోజే 5.75 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసి సత్తా చాటింది.

షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. వారాంతంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Dacoit movie
Adivi Sesh
Mrunal Thakur
Dacoit collections
Telugu movies
Box office collections
Shaniel Deo
Annapurna Studios
North America box office

More Telugu News