రేపే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. వాట్సాప్ లో రిజల్ట్స్ ఎలా పొందాలంటే..!

Telangana Inter Results 2024 Check on WhatsApp
షార్ట్స్‌లో చూడండి

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 12న (రేపు) విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ఒక వినూత్నమైన డిజిటల్ సేవను అందుబాటులోకి తెచ్చింది.


ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్లు మొరాయించినా లేదా ఇంటర్నెట్ నెమ్మదిగా ఉన్నా, విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ వాట్సాప్ ద్వారా నేరుగా మార్కులను తెలుసుకోవచ్చు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఐటీ శాఖ గతేడాది ప్రారంభించిన 'మీసేవ వాట్సాప్ చాట్‌బాట్' ఇప్పుడు ఇంటర్ ఫలితాలను కూడా అందించబోతోంది.


వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే విధానం:

  • ముందుగా మీ మొబైల్‌లో 8096 95 8096 నంబర్‌ను సేవ్ చేసుకోండి.

  • వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపండి.

  • వచ్చే రిప్లైలో 'మెనూ' (Menu) పై క్లిక్ చేసి 'BIE Exam Result' ఆప్షన్‌ను ఎంచుకోండి.

  • అనంతరం 'Open Service' బటన్ నొక్కండి.

  • అక్కడ మీ హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1st/2nd Year), స్ట్రీమ్ (General/Vocational) వివరాలను ఎంటర్ చేయండి.

  • సమర్పించిన వెంటనే మీ ఫలితం మరియు మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Go Back to Shorts
Telangana Inter Results
TS Inter Results 2024
Inter Results
Telangana Board
Sridhar Babu
MeSeva WhatsApp Chatbot
WhatsApp Results
TGIBE
Telangana Education

More Telugu News