విమానంలో కట్టప్ప.. ‘బాహుబలిని ఎందుకు చంపావ్?’ అని అడిగేసిన పైలట్!
ఒక సాధారణ విమాన ప్రయాణం ఓ పైలట్‌కు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయిన పాత్రధారి పక్కన కూర్చుని, ఒకప్పుడు దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రశ్న అడిగే అవకాశం అతడికి దక్కింది. ఇండిగో పైలట్ హేమంత్ నాయుడు ఇటీవల ఈ ఆసక్తికర అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకోగా, అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘బాహుబలి’ చిత్రంలో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు సత్యరాజ్‌ను హేమంత్ విమానంలో కలిశారు. తన ఫ్లైట్ డ్యూటీ ముగిసిన తర్వాత ప్రయాణికుడిగా కూర్చున్న హేమంత్‌కు పక్క సీట్లోనే సత్యరాజ్ కూర్చోవడం యాదృచ్ఛికంగా జరిగింది. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అని అడిగే అవకాశం మీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకైతే వచ్చింది" అంటూ హేమంత్ తన వీడియోను ప్రారంభించారు. ఈ ఘటన 35,000 అడుగుల ఎత్తులో జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా సత్యరాజ్‌తో తాను దిగిన ఫోటోలను షేర్ చేశారు. 71 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా, వినయంగా ఉన్నారని హేమంత్ ప్రశంసించారు. తన షూటింగ్ షెడ్యూల్స్, క్రమశిక్షణ గురించి సత్యరాజ్ మాట్లాడారని, "ఆరోగ్యమే అసలైన సంపద" అని తనకు సూచించారని పైలట్ పేర్కొన్నారు. ఆయనలో ఎక్కడా స్టార్‌డమ్ కనిపించలేదని, ఆయన వినయం తనను ఎంతగానో ఆకట్టుకుందని హేమంత్ వివరించారు.
2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’ క్లైమాక్స్‌లో "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక పైలట్ నేరుగా కట్టప్ప పాత్రధారినే ఆ ప్రశ్న అడగటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.