రాజస్థాన్‌లో విచిత్రం.. ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ చలాన్.. పొరపాటైందన్న పోలీసులు!
రాజస్థాన్‌లో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. కాలుష్యానికి ఏమాత్రం కారణం కాని ఎలక్ట్రిక్ వాహనానికి (ఈవీ) పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్ లేదంటూ ఓ పోలీసు అధికారి చలాన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాల్లోకి వెళితే.. నాగౌర్ జిల్లాలో ఓ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఆపారు. కారు అద్దాలకు సన్‌షేడ్స్ ఉన్నాయని మొదట రూ. 200 జరిమానా విధించారు. ఆ తర్వాత పీయూసీ సర్టిఫికెట్ చూపించమని అడగ్గా, ఎలక్ట్రిక్ వాహనానికి అది అవసరం లేదని కారు యజమాని వాదించారు. అయినప్పటికీ అధికారి వినిపించుకోకుండా పీయూసీ లేనందుకు మరో రూ. 1,500 చలాన్ విధించారు.
ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కారు యజమానితో వాగ్వాదం జరిగిన గందరగోళంలో పొరపాటున పీయూసీ చలాన్ జారీ చేశామని అంగీకరించారు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని, పొరపాటుగా వేసిన ఫైన్‌ను సిస్టం నుంచి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ నుంచి పూర్తి మినహాయింపు ఉంది.