Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటీటీలో ఈ వారం సినిమాలు

OTT Releases This Week Movies and Web Series
Advertisement
  • ఈ రోజు థియేటర్లలోకి ‘డెకాయిట్’, 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'
  • ‘డెకాయిట్’ పై భారీ అంచనాలు.. జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్
  • ఓటీటీల్లోనూ సందడి.. 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు
  • నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌, హాట్‌స్టార్‌లలో పలు క్రేజీ చిత్రాల స్ట్రీమింగ్
Advertisement
మరో వారాంతం వచ్చేసింది. ఈ రోజు శుక్రవారం కావడంతో సినీ ప్రియులకు పండగే. ఈ వారం థియేటర్లలో కొత్త చిత్రాలతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ పెద్ద సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు అనేక ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి.

ఈ రోజు టాలీవుడ్ నుంచి అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండటం విశేషం. మరోవైపు, కోలీవుడ్ నుంచి ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టిల 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)' కూడా ఇదే రోజు విడుదలవుతోంది. ఇది ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీగా రానుంది.

థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ చిత్రాల సందడి నెలకొంది. దాదాపు పదికి పైగా కొత్త కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. వీటిలో ఇటీవల తమిళంలో విజయం సాధించిన 'తాయ్ కిజవి' చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ చిత్రాలైన 'తూ యా మై' నెట్‌ఫ్లిక్స్‌లో, షాహిద్ కపూర్ నటించిన 'ఓ రోమియో' అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానున్నాయి. హాలీవుడ్ స్టార్ కీనూ రీవ్స్ నటించిన డార్క్ కామెడీ 'ఔట్‌కమ్' ఆపిల్ టీవీ ప్లస్‌లో విడుదల కానుండటం మరో ఆకర్షణ. 
Advertisement
Advertisement
OTT releases
New movies
Streaming
Dacoit movie
Adivi Sesh
Mrinal Thakur
Love Insurance Company
Pradeep Ranganathan
Kriti Shetty
Weekend releases

More Telugu News