రాజకీయ ఫ్లెక్సీలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎవరిని ధ్వంసం చేస్తారని ప్రశ్న

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో ఆక్షేపణీయ పోస్టుల సంస్కృతిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఎవరిని ధ్వంసం చేస్తారు? 2029లో ధ్వంసం చేయాలని ఎదురు చూస్తున్నారా? రాష్ట్రాన్నా లేక ప్రజలనా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని మండిపడింది.

వైసీపీ మాజీ సోషల్ మీడియా వింగ్ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను (ఎల్‌ఓసీ) రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆక్షేపణీయ పోస్టులు పెట్టేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఒకసారి అరెస్ట్ చేసినా మళ్లీ అలాంటి పోస్టులే పెడుతున్నారని, గతంలో న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకున్న వారిపై కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గుర్తుచేసింది. 2024 ఎన్నికల తర్వాత కూడా ఇంకా ఇలాంటివి కొనసాగిస్తున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

"ముఖ్యమంత్రిని అవమానించడం అంటే 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించడమే. ఎవరి కుటుంబాన్ని అయినా అవమానించే హక్కు ఎవరికీ లేదు" అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.

Sajjala Bhargav Reddy
Andhra Pradesh
political flex banners
social media posts
AP High Court
YS Jagan Mohan Reddy
YSRCP
look out circular
defamatory posts
political criticism

More Telugu News