జగన్ పై షర్మిల విమర్శలు... ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రోజా

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలకు వైసీపీ నేత రోజా గట్టిగా బదులిచ్చారు. కూటమి పార్టీలకు షర్మిల దత్తపుత్రికగా మారారని విమర్శించారు. "అలాంటి మీకు మా నాయకుడు జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా?" అని రోజా సూటిగా ప్రశ్నించారు.

"కోట్లాది మంది దేవుడిగా పూజించే వైయస్ఆర్ గారిని జీవితాంతం వ్య‌తిరేకించిన చంద్రబాబుతో చేతులు క‌లిపింది మీరు కాదా? జ‌గ‌న్ గారి ప‌తనం కోసం త‌ప‌న‌ప‌డుతున్న‌ది మీరు కాదా? జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్య‌తిరేకిస్తే మీరు మాత్రం ఇక్క‌డ ఎందుకు చేతులు క‌లిపారో ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌నుకుంటున్నారా? వైయ‌స్ఆర్ గారికి నిజ‌మైన వార‌సుడు మా జ‌గ‌న‌న్నే అని ప్ర‌జ‌లు ఎప్పుడో నిర్ణ‌యించారు. రాష్ట్ర రాజ‌కీయాల‌ను, ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును పేకాట‌గా చూస్తున్న మీకు రాజ‌కీయ ప‌రిణితి ఏ మాత్రం ఉందో అర్థ‌మ‌వుతోంది" అంటూ రోజా విమర్శనాస్త్రాలు సంధించారు.

YS Sharmila
YS Jagan
Roja
Andhra Pradesh Congress
YSR Congress
Chandrababu Naidu
AP Politics
Political Criticism
Alliance Politics

More Telugu News