అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదు

Ambati Rambabu Faces Police Case in Guntur
షార్ట్స్‌లో చూడండి

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన వ్యవహారంలో ఆయనపై అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు నిర్వహించారనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.


ఘటన వివరాల్లోకి వెళితే... ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కొన్ని కథనాలకు నిరసనగా నిన్న గుంటూరులోని ఆ పత్రిక కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. శాంతియుత నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ, అది ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడం, విధుల్లో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో, గుంటూరులోని అరండల్ పేట పోలీస్‌స్టేషన్‌లో అంబటి రాంబాబుతో పాటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి మురళి సహా పలువురు వైసీపీ నేతలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. మరోవైపు, నెల్లూరులో మరో మాజీ మంత్రి కాకాణిపై కూడా పోలీసు కేసు నమోదయింది.


రాష్ట్రవ్యాప్తంగా ఏబీఎన్ కార్యాలయాల వద్ద వైసీపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీయడం, వరుసగా మాజీ మంత్రులపై కేసులు నమోదు కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని కూటమి నేతలు విమర్శిస్తుండగా, తమ నాయకుడిపై తప్పుడు కథనాలు రాస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Go Back to Shorts
Ambati Rambabu
Guntur
Andhra Jyothi
YSRCP
Modugula Venugopal Reddy
Ambati Murali
Police Case
Protest
ABN Andhra Jyothi
Nellore Kakani

More Telugu News