కొడుకు పేరుతో కొన్న లాటరీ టికెట్ కు రూ.1.5 కోట్ల ప్రైజ్
పంజాబ్‌లోని నవాన్‌షహర్‌కు చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని అదృష్టం వరించింది. గత 40 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న గుర్చరణ్ సింగ్‌కు రూ.1.5 కోట్ల బంపర్ ప్రైజ్ తగిలింది. తన కుమారుడి పేరుతో కొనుగోలు చేసిన రూ.200 టికెట్‌కు ఈ జాక్‌పాట్ వచ్చింది.
వృత్తిరీత్యా తబలా కళాకారుడు, పెయింటర్‌గా పనిచేసే గుర్చరణ్ సింగ్.. ఈనెల 4న తీసిన నెలవారీ బంపర్ లాటరీ డ్రాలో విజేతగా నిలిచారు. లాటరీ ఏజెంట్ ఫోన్ చేసి విషయం చెప్పగా, మొదట అది ఫేక్ కాల్ అని ఆయన అనుమానించారు. ఆ తర్వాత ఏజెంట్ కార్యాలయానికి వెళ్లి నిర్ధారించుకున్నాక ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
గుర్చరణ్ సింగ్ మాట్లాడుతూ, "నేను భోజనం చేస్తుండగా ఫోన్ వచ్చింది. రూ.1.5 కోట్ల లాటరీ తగిలిందని చెప్పారు. మొదట నమ్మలేకపోయాను. ఈ డబ్బును నా పిల్లలు, మనవళ్ల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా వారి చదువుల కోసం వినియోగిస్తాను" అని తెలిపారు. గుర్చరణ్ కుమార్తె పరంజీత్ కౌర్ మాట్లాడుతూ.. తమది చాలా పేద కుటుంబమని, ఈ వార్త విని ఎంతో సంతోషించామని చెప్పారు.