మే నెలలో 14 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రచారం.. స్పందించిన అమెజాన్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వచ్చే మే నెలలో దాదాపు 14 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆసియా బిజినెస్ ఔట్ లుక్ వెల్లడించింది. అయితే, ఓ ఆంగ్ల మీడియా ఛానల్‌తో అమెజాన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారం విశ్వసించవద్దని కోరారు.
మే నెలలో చేపట్టనున్న ఈ తొలగింపుల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్‌తో పాటు మానవ వనరుల విభాగాలలోని ఉద్యోగులపై ప్రభావం పడనుందని నివేదికలు తెలిపాయి. 2025 చివరి నాటికి ఈ సంస్థ 14 వేల మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది జనవరిలో 16 వేల మందికి ఉద్వాసన పలికింది. అయితే మరో విడత తొలగింపు అంటూ వచ్చిన వార్తలను అమెజాన్ ఖండించింది.