బుమ్రాలోనూ భయం పుట్టించాడు: వైభవ్ సూర్యవంశీపై డేల్ స్టెయిన్ ప్రశంసలు
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్‌తో బౌలర్లపై మానసికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడని, చివరికి జస్‌ప్రీత్ బుమ్రా లాంటి మేటి బౌలర్లను కూడా తప్పిదాలు చేసేలా ఒత్తిడికి గురిచేస్తున్నాడని దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసించాడు. సూర్యవంశీ బౌలర్ల గుండెల్లో భయాన్ని నింపుతున్నాడని ఆయన అభిప్రాయపడ్డాడు.
మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన తొలి బంతినే సూర్యవంశీ మిడ్-ఆన్ మీదుగా బౌండరీ తరలించిన విషయాన్ని స్టెయిన్ గుర్తుచేశాడు. "బుమ్రా వేసిన ఆ బంతి స్లాట్‌లో పడింది. బుమ్రా నుంచి ఇలాంటి బంతి రావడం చాలా అరుదు. 'తప్పు చేస్తే సిక్స్ కొడతాడు' అని బుమ్రా మదిలో కూడా మెదిలి ఉంటుంది. అలా అనుకున్నప్పుడు చాలాసార్లు పొరపాట్లు జరుగుతాయి. సరిగ్గా అదే జరిగింది," అని స్టెయిన్ వివరించాడు.
సూర్యవంశీకి భయం లేదని, ఎదురుగా ఉన్న బౌలర్ ఎవరైనా సరే, చెత్త బంతి వేస్తే శిక్షించడం ఖాయమని స్టెయిన్ అన్నాడు. "ఆ కుర్రాడికి భయమంటే తెలియదు. బౌలర్ బుమ్రా అయినా, సాధారణ బౌలర్ అయినా సరే.. బంతి మిస్ అయితే బౌండరీ దాటాల్సిందే. ఇది అద్భుతమైన బ్యాటింగ్" అని కొనియాడాడు.
గౌహతిలో వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్‌లో, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం అందించారు. సూర్యవంశీ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేయగా, జైస్వాల్ 32 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.