జైస్వాల్ విధ్వంసం.. ముంబైపై రాజస్థాన్ ఘన విజయం
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. మంగళవారం వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (77 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజస్థాన్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముంబై బౌలర్లలో గజన్‌ఫర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ఒత్తిడికి కుప్పకూలింది. రియాన్ రికెల్టన్ (8), సూర్యకుమార్ యాదవ్ (6), రోహిత్ శర్మ (1), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ముంబై 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత నమన్ ధిర్ (25), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (25) కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. చివరకు ముంబై 11 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.