తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... విజయ్ నామినేషన్లకు రెండు చోట్లా తొలగిన అడ్డంకులు
నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండడం తెలిసిందే. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో కొన్ని తప్పులు దొర్లడంతో అధికారులు వాటిని హోల్డ్ లో ఉంచారు. తాజాగా, విజయ్ సవరించిన అఫిడవిట్లను సమర్పించడంతో పెరంబూర్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో ఆయన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు.
విజయ్ మార్చి 30న చెన్నైలోని పెరంబూర్, ఏప్రిల్ 2న తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ రెండు అఫిడవిట్లలోని వివరాల్లో తేడాలు ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుచ్చి అఫిడవిట్లో తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్న విజయ్, పెరంబూర్ అఫిడవిట్లో మాత్రం ఎలాంటి కేసులు లేవని తెలిపారు. అలాగే, వయసు విషయంలోనూ పెరంబూర్‌లో 52 ఏళ్లుగా, తిరుచ్చిలో 51 ఏళ్లుగా ప్రకటించారు.
ఈ తప్పులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరగడంతో విజయ్ బృందం వెంటనే స్పందించింది. ఏప్రిల్ 4న పెరంబూర్ నియోజకవర్గానికి సంబంధించిన అఫిడవిట్‌ను సవరించి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మళ్లీ సమర్పించింది. ఇందులో తన వయసును 51 ఏళ్లుగా సరిదిద్దడంతో పాటు, రెండు క్రిమినల్ కేసుల వివరాలను కూడా పొందుపరిచారు. కొళత్తూరులో నిరసన సందర్భంగా ఒక కేసు, గతేడాది మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఘర్షణకు సంబంధించి మరో కేసు నమోదైనట్లు వెల్లడించారు.
గడువులోగా తప్పులను సరిదిద్దడంతో నామినేషన్లను తిరస్కరించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. డీఎంకే, పలువురు స్వతంత్ర అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, అధికారులు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా రెండు చోట్లా విజయ్ నామినేషన్లను ఆమోదించారు. మరోవైపు, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా పలువురు ప్రముఖ నేతల నామినేషన్లు కూడా ఆమోదం పొందాయి.