200 యూట్యూబ్ చానళ్లను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది: జూపల్లి కృష్ణారావు

అక్రమంగా గడించిన వేల కోట్ల రూపాయలతో బీఆర్‌ఎస్ పార్టీ ఏకంగా 200 యూట్యూబ్ ఛానెళ్లను కొనుగోలు చేసి, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా బీఆర్‌ఎస్ బురదజల్లుతోందని, వీటిని కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 


కేవలం ఇంట్లో కూర్చుంటే అధికారం రాదని, 'మంత్రాలకు చింతకాయలు రాలవు' అనే నిజాన్ని గుర్తించి ఫీల్డ్‌లోకి వెళ్లి పని చేయాలని సూచించారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు, రాష్ట్రంలో పార్టీని నిలబెట్టేందుకు ప్రతి కార్యకర్త రోజుకు ఒక గంట సమయం కేటాయించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.


Jupally Krishna Rao
BRS party
Youtube channels
Telangana politics
Congress party
Social media
Fake news
Rahul Gandhi
Welfare schemes

More Telugu News