అల్లరి నరేశ్ 'కనక దుర్గ'... కెమెరా స్విచాన్ చేసిన కొణిదెల సురేఖ
విలక్షణ నటుడు అల్లరి నరేశ్ హీరోగా ‘కనక దుర్గ’ అనే కొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సురేఖ కొణిదెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమిళ చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. టెంపుల్ టౌన్ పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్న ఈ భక్తి ప్రధాన యాక్షన్ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు. ఇందులో కాజల్ చౌదరి హీరోయిన్గా, సుబ్బరాజు కీలక పాత్రలో నటించనున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వప్న దత్ గౌరవ దర్శకత్వం వహించారు.
భక్తి, యాక్షన్, భావోద్వేగాల కలయికగా ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్‌తో పాటు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, కోన వెంకట్, స్వప్న దత్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
దక్షిణ భారతంలో తమ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ, ఇప్పుడు ‘కనక దుర్గ’తో తెలుగులోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు తెలిపారు.
తెలుగు నేల ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్న కథతో తమ ప్రయాణం మొదలవ్వడం ప్రత్యేకమని టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాతలు బీవీఎస్ రవి, అజిత్ ఠాకూర్ పేర్కొన్నారు. అమ్మవారిపై ఉన్న భక్తితో పాటు, ఒక మనిషి ఉన్నత శక్తిని ఎదుర్కొన్నప్పుడు ఏం జరుగుతుందనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు ప్రదీప్ మద్దాలి వివరించారు.