హీరో విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ప్రశంసలు

దక్షిణాదిలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్... తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ఐశ్వర్య చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


విజయ్ ఎప్పుడూ ఇతరుల గురించి తప్పుగా మాట్లాడరని, తన పని తాను చేసుకుంటూ వెళతారని ఐశ్వర్య తెలిపారు. బయట ఎంతమంది విమర్శలు చేసినా, నెగెటివ్‌గా మాట్లాడినా ఆయన అవేమీ పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు సాగిపోతారని ఆమె పేర్కొన్నారు. ఈ లక్షణమే ఆయనను అందరికంటే ప్రత్యేకం చేస్తుందని అభిప్రాయపడ్డారు.


"విజయ్ సార్‌కు తన అభిమానులే ప్రపంచం. వారిని ఎలా సంతోషపెట్టాలో ఆయనకు బాగా తెలుసు" అని ఐశ్వర్య కొనియాడారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా తన వారి కోసం ఆయన నిలబడతారని, నేటి యువతకు ఆయన ఒక గొప్ప రోల్ మోడల్ అని ఆమె ప్రశంసించారు.

సినిమాల విషయానికి వస్తే... ఆమధ్య వెంకటేశ్ సరసన నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో ఐశ్వర్య భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తిరువీర్‌తో కలిసి ‘ఓ సుకుమారి’ అనే చిత్రంలో నటిస్తూనే, మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Aishwarya Rajesh
Vijay
Tamil Nadu Politics
Kollywood
Actor Vijay
Aishwarya Rajesh Interview
Vijay Fans
O Sukumari Movie
Thalapathy Vijay
Venkatesh

More Telugu News