Donald Trump: ట్రంప్ వ్యాఖ్యలు.. ఐక్యరాజ్య సమితిపై ఇరాన్ ఆగ్రహం

Iran Angered by Trump Remarks on United Nations
షార్ట్స్‌లో చూడండి
ఐక్యరాజ్య సమితిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితికి అంతరాత్మ అనేది ఉంటే అమెరికా అధ్యక్షుడి యుద్ధోన్మాదంపై మౌనంగా ఉండదని వ్యాఖ్యానించింది. ట్రంప్ ఈ ప్రాంతాన్ని ముగింపు లేని యుద్ధంలోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి యుద్ధ నేరాలను అంతర్జాతీయ సమాజం నిరోధించాలని పేర్కొంది.

ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది. మౌలిక సదుపాయాలను పేల్చేస్తామంటూ ట్రంప్ బెదిరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.  ట్రంప్ వ్యాఖ్యలపై ఐరాస, అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసింది. ఆలస్యం చేయకూడదని తెలిపింది.

ఆయన వ్యాఖ్యలు ఇరాన్ పౌరులను భయపెట్టడం కిందకే వస్తాయని తెలిపింది. కాబట్టి ఆయన వ్యాఖ్యలు యుద్ధనేరమేనని ఇరాన్ స్పష్టం చేసింది. కాగా, ఇరాన్‌కు నరకం చూపిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
Go Back to Shorts
Donald Trump
Iran
United Nations
UN
War Crimes
US Iran Relations
Middle East Conflict
Iran Mission to UN

More Telugu News