Nara Lokesh: సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు లోకేశ్ హాజరు... ఫొటోలు ఇవిగో!

Nara Lokesh Attends Sunrise Hospitals MD Sons Wedding Reception
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. విజయవాడకు చెందిన సన్‌రైజ్ హాస్పిటల్స్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ మాదాల నరేంద్ర కుమార్ తనయుడి వివాహ రిసెప్షన్‌లో ఆయన పాల్గొన్నారు.

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్, నూతన వధూవరులు సాయి శిశిర్, వైష్ణవిలను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని లోకేశ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

వధూవరులతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ, "విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్స్ ఎండీ, ఛైర్మన్ డాక్టర్ మాదాల నరేంద్ర కుమార్ గారి తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నవ దంపతులు సాయి శిశిర్, వైష్ణవిలను ఆశీర్వదించాను" అని తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, రిసెప్షన్ వేదిక వద్ద లోకేశ్ రాకతో కోలాహలం ఓ రేంజిలో నెలకొంది. పెళ్లికి వచ్చినవాళ్లు లోకేశ్ తో సెల్ఫీలకు పోటీ పడ్డారు. లోకేశ్ నవ్వుతూ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు. 
Go Back to Shorts
Nara Lokesh
AP Minister
Sunrise Hospitals
Madala Narendra Kumar
Wedding Reception
Mangalagiri
Sai Sishir
Vaishnavi
Andhra Pradesh Politics

More Telugu News