Nandini Agarwal: ఎవరీ నందినీ అగర్వాల్..? 19 ఏళ్లకే సీఏ... వరల్డ్ రికార్డు!
పట్టుదల, కఠోర శ్రమ ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపించింది మధ్యప్రదేశ్‌కు చెందిన నందిని అగర్వాల్. కేవలం 19 ఏళ్ల 8 నెలల 18 రోజుల వయసులో చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) ఫైనల్ పరీక్షను క్లియర్ చేసి, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన సీఏగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఈ అసాధారణ విజయంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా ఆమె పేరు నమోదైంది.
మధ్యప్రదేశ్‌లోని చిన్న పట్టణం మొరేనాలో జన్మించిన నందిని, 2021లో జరిగిన సీఏ ఫైనల్ పరీక్షలో సంచలనం సృష్టించింది. దాదాపు 83,000 మంది అభ్యర్థులను అధిగమించి, 800 మార్కులకు 614 మార్కులు (76.75 శాతం) సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. దీనికంటే ముందు 16 ఏళ్ల వయసులోనే సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలో ఆలిండియా లెవల్లో 31వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటుకుంది. చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండే నందిని, 13 ఏళ్లకే 10వ తరగతి, 15 ఏళ్లకే 12వ తరగతి పూర్తి చేసింది.
11వ తరగతి చదువుతున్నప్పుడు తన పాఠశాలకు వచ్చిన ఓ గిన్నిస్ రికార్డు హోల్డర్‌ను చూసి తాను కూడా అలాంటి రికార్డు సాధించాలని కలలు కన్నట్లు నందిని తెలిపింది. "ఎవరూ సులభంగా బద్దలు కొట్టలేని రికార్డు సృష్టించాలని నేను అప్పటి నుంచే లక్ష్యంగా పెట్టుకున్నాను" అని ఆమె వివరించింది. ఆమె కుటుంబంలో కూడా విద్యాపరమైన ప్రతిభకు కొదవలేదు. నందిని విజయం సాధించిన అదే ఏడాది, ఆమె అన్నయ్య సచిన్ (21) కూడా సీఏ ఫైనల్స్‌లో 568 మార్కులతో అఖిల భారత స్థాయిలో 18వ ర్యాంకు సాధించడం విశేషం.
చదువు పూర్తయ్యాక, నందిని తన కార్పొరేట్ ప్రయాణాన్ని ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ లో ఆర్టికల్ ట్రైనీగా ప్రారంభించారు. అక్కడ స్టాట్యుటరీ ఆడిట్స్, గ్రూప్ రిపోర్టింగ్, ట్యాక్స్ ఆడిట్స్, ఫోరెన్సిక్ ఆడిట్స్ వంటి పలు విభాగాల్లో మూడేళ్ల పాటు అనుభవం గడించారు. ప్రస్తుతం సీఏగా పనిచేస్తూనే, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా కూడా రాణిస్తున్నారు. ఫైనాన్షియల్ లిటరసీ, ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు, సీఏ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి వంటి అంశాలపై వీడియోలు చేస్తూ 6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. "ఖర్చు చేయడానికి ముందే ఇన్వెస్ట్ చేయాలి" అనే సూత్రాన్ని తాను పాటిస్తానని, 16 ఏళ్ల వయసులోనే తొలి పెట్టుబడి పెట్టానని ఆమె చెప్పారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన క్షణాన్ని ఆమె ఎంతో ఉద్వేగంగా పంచుకున్నారు. "ఒక సాధారణ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు నా ఫోన్‌కు వచ్చిన ఈమెయిల్ నా జీవితాన్ని మార్చేసింది. 'అభినందనలు, ఇప్పుడు మీరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ హోల్డర్' అనే సందేశం చూసి ఎంతో ఆనందించాను" అని ఆమె తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా లక్ష్య సాధన కోసం కష్టపడితే ఎవరైనా విజయం సాధించవచ్చని నందిని అగర్వాల్ జీవితం ఎందరో యువతకు స్ఫూర్తినిస్తోంది.