Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక 'రణబాలి' రాయలసీమ షెడ్యూల్ పూర్తి

Vijay Deverakonda and Rashmika Ranabali Rayalaseema schedule complete
షార్ట్స్‌లో చూడండి
రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం 'రణబాలి' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రాయలసీమలో చేపట్టిన కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రాయలసీమ ప్రజలు తమకు ఎంతో ప్రేమను పంచారని పేర్కొంటూ ఓ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది.

షూటింగ్ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "నా సొంత ఊరికి వచ్చినట్లు అనిపిస్తోంది. అనంతపురం నా రెండో సొంతూరిలా ఉంది. నాలో ఎప్పుడూ ఒక సీమ ఫీలింగ్ ఉంటుంది" అని అన్నారు. ఈ చిత్రంలో విజయ్ 'రణబాలి' పాత్రలో నటిస్తుండగా, ఆయన భార్య 'జయమ్మ' పాత్రలో రష్మిక కనిపించనుంది. సెప్టెంబర్ 11న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 19వ శతాబ్దంలోని బ్రిటిష్ పాలన నేపథ్యంలో రూపొందిస్తున్నారు. 1854-1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చరిత్రలో చోటు దక్కని, బ్రిటిష్ వారు తప్పుగా చిత్రీకరించిన అనేక సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారని సమాచారం. 'ది మమ్మీ' ఫేమ్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటిస్తున్న మూడో సినిమా కావడంతో 'రణబలి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టును టి-సిరీస్ సమర్పిస్తోంది.
Go Back to Shorts
Vijay Deverakonda
Rashmika Mandanna
Ranabali
Rahul Sankrityan
Rayalaseema
Telugu movie
Mythri Movie Makers
Geetha Govindam
Dear Comrade
Arnold Vosloo

More Telugu News