టాలీవుడ్‌లో విషాదం.. దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి హఠాన్మరణం!

Tragedy in Tollywood Late actor Sobhan Babu wife Shanta Kumari passes away suddenly
  • చెన్నైలో కన్నుమూసిన శాంతకుమారి
  • అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • స్నేహితురాలితో మాట్లాడుతుండగా గుండుపోటు
  • నేడు అంత్యక్రియలు
  • సినీ ప్రముఖులు, అభిమానుల నివాళులు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటన, అందంతో 'సోగ్గాడు'గా పేరు తెచ్చుకున్న దివంగత నటుడు శోభన్‌బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి శాంతకుమారి (86) గురువారం చెన్నైలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఒక  ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గురువారం ఆసుపత్రిలో తనను పరామర్శించడానికి వచ్చిన ఒక ఆప్తమిత్రురాలితో  ఆమె మాట్లాడుతుండగా, అకస్మాత్తుగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

శాంతకుమారి హఠాన్మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె భౌతికకాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. శోభన్‌బాబు స్టార్ హీరోగా రాణిస్తున్న సమయంలో కూడా శాంతకుమారి ఎప్పుడూ ప్రచారానికి దూరంగా, ఒక సాధారణ గృహిణిగా కుటుంబ బాధ్యతలను చూసుకునేవారు. ఈమె మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, శోభన్‌బాబు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నివాళులర్పిస్తున్నారు.
Advertisement
Shanta Kumari
Sobhan Babu
Tollywood Tragedy
Shanta Kumari Death
Sobhan Babu Wife
Telugu Cinema News

More Telugu News