Amit Shah: అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం... బెంగాల్‌లో పోలీసు అధికారుల సస్పెన్షన్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం, ఘర్షణ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. రెండు రోజుల క్రితం అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌లో పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

దీనితో బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శిని కోరింది. ఆయన నివేదిక సమర్పించడంతో దాని ఆధారంగా ఈసీ చర్యలు తీసుకుంది. అమిత్ షా పర్యటనలో అనేక భద్రతా వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది. దీనికి బాధ్యులను చేస్తూ సిద్ధార్థ్ దత్తా అనే డీసీపీ సహా మరో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్నది. అధికారులు శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమయ్యారని పేర్కొంది.

కాగా, భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఆమెపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి బరిలోకి దిగారు. దీనితో ఈ నియోజకవర్గం కీలకంగా మారింది. ఇక్కడ మమతా బెనర్జీని ఓడించాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
Amit Shah
Amit Shah Bengal Visit
Bengal Police Suspension
Suvendu Adhikari
Bhabanipur Constituency

More Telugu News