Anand Mahindra: లెజెండ్స్ దూసుకెళుతున్నాయి... ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

ఒకప్పుడు భారత రోడ్లపై రారాజులుగా వెలిగిన జావా, యెజ్డీ, బీఎస్ఏ బైక్‌లు మళ్లీ తమ హవా చూపిస్తున్నాయి. ఈ ఐకానిక్ బ్రాండ్ల అమ్మకాలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీ వృద్ధిని నమోదు చేస్తున్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. మార్చి 2026 అమ్మకాల గణాంకాలను పంచుకుంటూ ఆయన ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

ఆనంద్ మహీంద్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ బైక్‌ల దేశీయ విక్రయాలు 115 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ బ్రాండ్లకు ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది అంతర్జాతీయ అమ్మకాలు తొలిసారిగా 1,000 యూనిట్ల మార్కును దాటి, అనేక రెట్ల వృద్ధిని నమోదు చేశాయి. గత 12 నెలల కాలంలో మొత్తం నెలవారీ విక్రయాల పరిమాణం రెండున్నర రెట్లు పెరగడం విశేషం.

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, "లెజెండ్స్ తిరిగి వచ్చాయి, మునుపటి కంటే వేగంగా దూసుకెళుతున్నాయి" అని వ్యాఖ్యానించారు. మహీంద్రాకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ బ్రాండ్లు లాభదాయకమైన వృద్ధిని సాధిస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటూ ఈ బ్రాండ్లు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
Anand Mahindra
Java bikes
Yezdi bikes
BSA bikes
Classic Legends
Indian motorcycles
Motorcycle sales India
Automobile industry India
Bike sales growth
Mahindra Group

More Telugu News